Labels

Tuesday, September 30, 2014

సంఘర్షణ


                                                                సంఘర్షణ


జీవితం వెలుగయి ప్రసరిస్తుంటే
చావు నీడై అనుసరిస్తుంది
కాని అదే నీడ ఎదురొచ్చి చీకటిలా చిక్క పడ్తుంటే
ప్రతి క్షణం నా జీవితపు ప్రయాణం ప్రమాదంలా తలపిస్తుంది ,

నా ప్రమేయం లేకుండానే నా ప్రస్థానం ముగుస్తుందన్న కఠిన నిజం కవ్విస్తుంది .

ఆప్తులందరూ అపరిచితుల్లా , వాళ్ళ అభిమానం ఆవేదన  లా  అనిపిస్తుంటే ,
అనుక్షణం ఒంటరితనం ఓదారుస్తుంది ,
కాని ఒకవైపు శరీరం నీరసిస్తుంది
మరో వైపు మరణం నిరీక్షిస్తుంది
అన్ని వైపుల నుండి అంతం అనివార్యమై ఆవహిస్తుంది ,
అయిన జీవితం పై ఆరాటం, మరణం పై పోరాటం కొనసాగుతుంది
చూడాలి ఇంకెన్నాళ్ళో   ?


No comments:

Post a Comment