సంఘర్షణ
జీవితం వెలుగయి ప్రసరిస్తుంటే
చావు నీడై అనుసరిస్తుంది
కాని అదే నీడ ఎదురొచ్చి చీకటిలా చిక్క పడ్తుంటే
ప్రతి క్షణం నా జీవితపు ప్రయాణం ప్రమాదంలా తలపిస్తుంది ,
నా ప్రమేయం లేకుండానే నా ప్రస్థానం ముగుస్తుందన్న కఠిన నిజం కవ్విస్తుంది .
ఆప్తులందరూ అపరిచితుల్లా , వాళ్ళ అభిమానం ఆవేదన లా అనిపిస్తుంటే ,
అనుక్షణం ఒంటరితనం ఓదారుస్తుంది ,
కాని ఒకవైపు శరీరం నీరసిస్తుంది
మరో వైపు మరణం నిరీక్షిస్తుంది
అన్ని వైపుల నుండి అంతం అనివార్యమై ఆవహిస్తుంది ,
అయిన జీవితం పై ఆరాటం, మరణం పై పోరాటం కొనసాగుతుంది
చూడాలి ఇంకెన్నాళ్ళో ?