Labels

Tuesday, June 2, 2015

Telangana Avatarana




స్వచ్చమైన మనుషులకు స్వాతంత్రం ఒచ్చింది ,
స్వర్ణ యుగపు అంచులకు ప్రయాణం మొదలైంది ....
సాగర మధనం తర్వాతా లభించిన అమృతం లా ,
సాధనోధ్యమం తర్వాత గెలిచిన  స్వర్గ ప్రపంచమా`,
తేనే కన్నా తియ్యనైన తెలంగాణమ ,
అమ్మ జోల పాట కన్నా ఆత్మీయమైన తెలుగు గానమా ....

ఇన్నాళ్ళ వివక్ష ఇకనైనా పోవాలి ,
ఇక్కట్ల వేదన, ఇల్లాలి రోధన ఇంటింట దూరం కావాలి .
పురోగతి పునాదుల ఫై భవిష్యతు భవనాలు
ఆ ఫై ఆనందపు అంచులు తాకే అంతస్తులు కట్టాలి ,                                                                                           అలుపెరుగక శ్రమిస్తూ మన తరాలకు భవితవ్యం ఇవ్వాలి .


పాలకుల్లో ప్రక్షాళన ,
పాలనల్లో పరివర్తన ...
ప్రజల్లో పటుత్వం ,
పరస్పర సహకారం తో ,
అవతరణ నుండి అభివృద్ధి వైపు పయనం సాగాలి .
 దేశానికే ఆదర్శం కావాలి .....
అపుడే ఆత్మ బలిదానాలకు ,
అమరవీరుల ప్రాణాలకు
మనమందరం ఇచ్చే అసలు అశ్రు నివాళి అందుకు అనుక్షణం అంకితం అవ్వాలి .

జై తెలంగాణ జై జై తెలంగాణ ....

                                                                                                                                     సుధీర్