Labels

Sunday, January 3, 2010

ప్రేమ





ప్రేమ
ప్రేమ అంటే అర్థం తెలియని నా మనసులో ఆ ప్రేమకు చోటు లేక, చీకటి తో అంధకారమైన నా గుండెలో నీ రూపం అందం అనే అనంతమైన క్రాంతి తో , ఆ అంధకారాన్ని చీల్చి ప్రకాశించి ఇన్నాళ్ళు నేను వెదుకుతున్న ప్రేమ యొక్క అనుభూతిని అందించావు . కాని ఈ ప్రేమ యొక్క అసలైన అర్థం, నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలని నా అన్వేషణ .

ఎడారిలాంటి నా ప్రేమకి నీ నవ్వు నీటి బిందువై ప్రాణం పోసి, తోడు లేని నా జీవితం లో నీ పరిచయం ఒక వరముగా వచ్చి, నిశ్చలమై నిర్దిశమైన నా ఊహలకు నీ రూపం ఒక మార్గం చూపి నీ వైపు ఆకర్షించి చివరికి నీవే నా గమ్యం అంది ..

నా కంటి పాప ఫై కలకాలం నీ రూపం చేరగక తరగక కను మూసినా కనులు తెరిచినా ఎల్ల వేళల నీవు నా ఎదుట నా కళ్ళలో ఒదిగి ఉండాలని నా ఆశ .
నీ శ్వాస నాకు ప్రాణం కావాలని,
నీ పలుకే నాకు వేదం కావాలని,
నీ ప్రేమ నాకు తోడు కావాలని,
నీ అందమైన మనసులో నా పై అనంతమైన ప్రేమ ప్రేమ నిండాలని నా ఆశ .
నా కోరిక నెరవేరాలని ఆశ అది నెరవేరితే నేను వెదికే ప్రేమ యొక్క నిర్వచనం నాకు వరముగా దొరికినట్లే .....
--
Written by:- Sudhir.



No comments:

Post a Comment