శిల లాంటి నా ఊహలకు శిల్ప రూపమా ,
కల లాంటి ప్రేమకు కావ్య రూపమా ,
హాలాహలపు వాన లో కూడా విరిసే హరివిల్లువా
హర్షించే నా హృదయాన్ని స్పర్శించే మధువాణివా ?
నీ చిరునవ్వు తో మురిపాలు చిలికితే
ముత్యాల మీగడ నాదవ్వదా ?
నీ ఆధారాల అందాలను అల్లుకొని మధుర రస
సాగర మధనం చేస్తే అమృతం సైతం తుచ్చం కాదా?
నీ కళ్ళ వాకిళ్ళ లో ,
చక్కిళ్ళ తాకిడి తో,
పరువపు వాన లో తడిస్తే ,
పరవశపు అంచులు దరి చేరవా?
అందాల అంబరాన అరుంధతి తారవా ?
లేక ఆనందపు ఆలయానికి ఆరని దీపానివా ?
తిష్టగా ఎదురు చూస్తున్న నా ఆశల తీరాన్ని
ఆప్యాయపు ఆలవై అలుముకోవా ,
అనురాగపు లతవై ఆత్మీయంగా అల్లుకోవా ....
Written by: Sudhir
Wednesday, September 1, 2010
Subscribe to:
Posts (Atom)