Labels

Wednesday, September 1, 2010

Dream Girl

శిల లాంటి నా ఊహలకు శిల్ప రూపమా ,
కల లాంటి ప్రేమకు కావ్య రూపమా ,
హాలాహలపు వాన లో కూడా విరిసే హరివిల్లువా
హర్షించే నా హృదయాన్ని స్పర్శించే  మధువాణివా ?

నీ చిరునవ్వు తో మురిపాలు చిలికితే
ముత్యాల మీగడ నాదవ్వదా  ?
నీ ఆధారాల అందాలను అల్లుకొని మధుర రస 
సాగర మధనం చేస్తే అమృతం సైతం తుచ్చం కాదా?

నీ  కళ్ళ వాకిళ్ళ లో ,
చక్కిళ్ళ తాకిడి తో,
పరువపు వాన లో తడిస్తే ,
పరవశపు అంచులు దరి చేరవా?

అందాల అంబరాన అరుంధతి  తారవా ?
లేక ఆనందపు ఆలయానికి ఆరని దీపానివా ?
తిష్టగా ఎదురు చూస్తున్న నా ఆశల తీరాన్ని
ఆప్యాయపు ఆలవై అలుముకోవా ,
అనురాగపు లతవై ఆత్మీయంగా అల్లుకోవా ....

Written by: Sudhir

No comments:

Post a Comment