Labels

Sunday, June 6, 2010

హృదయం

విరహపు విహారం ,
కదలదు ఈ కాలం ,
ఎడబాటులో నీ స్నేహం ,
పొందక తీరదు ఈ దాహం....

నా హృదయం లో  నువ్వున్నావా అని సందేహించినప్పుడు
స్వాసై  ప్రతి క్షణం సమాధానం ఇస్తావు  ...
అదే శ్వాసను బంధించాలనుకున్నప్పుడు ,
మాయమయి చేతి రేఖలలో
దురదృష్టాన్ని మిగిల్చి చూపుతున్నావు ...

గుండెలో గూడు కట్టుకున్న గుట్టునెలా చెప్పను ?
చీకటిల కమ్ముకున్న చింతలనేల   చూపను ?
తలచినప్పుడల్లా తడిమి తడిమి చూస్తా ,
చెంత నువ్వు  లేక  చెమ్మగిల్లి పోతా .
ఎటు చూసిన ఎడబాటే ,
గుండె నిండా తడబాటే అందుకే ...,

ఆవేదనల ఆవాహం ,
అశ్రువుల  ప్రవాహం ,
అంతులేని   ఈ భారం,
అదే  నా హృదయపు విషాదం  .....

Written By :Sudhir

No comments:

Post a Comment